దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత నెల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పదివేల కేసులకు పైగా నమోదు కావడంతో అలర్ట్ అయ్యింది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ అమల్లో కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
ఇది చదవండి : పార్లమెంట్ కేంద్ర బడ్జెట్ 2022 లైవ్ అప్ డేట్స్
ఏపీలో నిత్యం 10 వేలకు చేరువలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిన్న రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య తగ్గింది. అయితే.. మరణా సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను రాష్ట్రంలో పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇది చదవండి : గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
60 ఏళ్లు దాటిన వృద్ధులు కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా సూచనలు చేసింది. ఇక కరోనా ఆంక్షలు కూడా కఠినతరం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ మాస్క్‌లు ధరించటం తప్పనిసరి. దీనిని అతిక్రమించిన వారికి రు.100 జరిమానా విధిస్తారు.