ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంపై మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసిందని చెప్పారు. జగన్ సర్కార్ ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందని..చెప్పిన ఆయన.. ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పకూడదనుకున్నా.. కానీ, కర్నూలుకు జ్యుడిషియల్ కేపిటల్ వచ్చేసింది అని అన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పుడే ప్రకటించకూడదని కూడా మంత్రిగారే చెప్పడం గమనార్హం.
అయితే.. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయన్నా మంత్రి గారు..ఏం జరగబోతుందో మీరే చూస్తారు’ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం అమరావతి చుట్టూ అభివృద్ధి అని గ్రాఫిక్స్ చూపిస్తూ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. ఓ సామాజిక వర్గానికి మాత్రమే అభివృద్ధి జరిగేలా పక్కాగా ప్లాన్ చేశారని పేర్కొన్నారు. అందుకే వికేంద్రీకరణ మంత్రంతో అభివృద్దితో పాటు పాలన కూడా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకంటించాక.. పెద్ద పెద్ద కంపెనీలు, సెజ్ రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ తీరు మారాల్సిన అవసరం ఉందని.. విజిలెన్స్, ఏసీబీ కేసుల ఫైల్స్ చూస్తే 150 కేసుల వరకు ఇవే పెండింగ్ ఉన్నాయన్నారు. సిటీ ప్లానర్ ఈ విషయంలో బాధ్యత వహించాలని.. కిందిస్థాయి సిబ్బందిపై నెపం వేస్తే కుదరదన్నారు.
ఇది కూడా చదవండి: RK Roja : ఒంటరిగా ఉంటున్నా. పిల్లను చూడండి.. మంత్రి రోజాకు వృద్ధుడి విన్నపం..