ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలల్లో బాలికలు పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ వారిదే పైచేయి. ఇక జిల్లాల వారీగా చూస్తే.. ఇంటర్ మొదటి ఏడాది ఫలితాల్లో కడప జిల్లా చివరి స్థానంలో ఉంటే, ఇంటర్ రెండో ఏడాది ఫలితాల్లో విద్యా శాఖ మంత్రికి చెందిన జిల్లా విజయనగరం చివరి స్థానంలో నిలిచింది.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 61 శాతం మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఉతీర్ణులవ్వగా, ఇంటర్ సెకండియర్ లో 72 శాతం మంది ఉతీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో మొత్తంగా బాలికలదే పైచేయి అని చెప్పాలి. ఫస్ట్ ఇయర్ లో 65 శాతం బాలికలు ఉతీర్ణత సాధించగా, 58 శాతం బాలురు పాసయ్యారు. అలాగే సెకండ్ ఇయర్ లో 75 శాతం బాలికలు పాసవ్వగా, 68 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు.
ఇక ఈ ఫలితాల్లో ఏ జిల్లా ఫస్ట్.. ఏ జిల్లా లాస్ట్ అంది చూస్తే.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవగా, కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇక సెకండియర్ ఫలితాల విషయానికొస్తే.. 83 శాతం ఉత్తీర్ణత కృష్ణా జిల్లా టాప్ లో నిలవగా, విద్యా శాఖ మంత్రికి చెందిన జిల్లా విజయనగరం చివరి స్థానంలో నిలిచింది.
ఇంటర్ ఫస్టియర్
ఇంటర్ సెకండియర్
రీకౌంటింగ్/ రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు మే 3వ తేదీ లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.