ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దుకాణాదారులకు కరోనా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అనుసరించాల్సిన నియంత్రణ చర్యలు దుకాణాదారులకు సూచించింది. దుకాణానికి ఎవరైన మాస్క్ లేకుండా వస్తే దుకాణాదారుడికి రూ.10 నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించి, రెండు రోజుల పాటు దుకాణం మూసివేయిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
ఈ మార్గదర్శకాలతో ఏపీలోని దుకాణాదారులు ఖంగుతిన్నారు. మాస్క్ లేకుండా తిరిగే వ్యక్తులకు ఫైన్ వేయకుండా.. తమపై జరిమానా విధిస్తే ఎలాగంటూ దుకాణాదారులు వాపోతున్నారు. మరి ఈ మార్గదర్శకాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.