ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ వార్తతో ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ వార్తతో ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నెల 7న జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ప్రభుత్వ అధికారులు పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపారు. దీంతోనే ఏపీ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని తాజాగా స్పష్టం చేసింది.
ఇక పెండింగ్ లో ఉన్న ఈ బకాయిల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.3 వేల కోట్ల నిధులను మంజూరు చేయనుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో ఉద్యోగులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లులకు కూడా ఏపీ ఆర్థిక శాఖ క్లియర్ చేయనుందని సమాచారం. ఇదిలా ఉంటే జగన్ సర్కార్ రైతులకు కూడా తాజాగా శుభవార్త తెలిపింది. రబీ సీజన్ లో పండించిన పప్పు, ధాన్యాలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించడం విశేషం.