భవన నిర్మాణ రంగంలో రాత్రింబవళ్లు కష్టపడే ప్రతీ కార్మికుడికి ఏపీ ప్రభుత్వం ఓ న్యూస్ చెప్పింది. ఎండనక, వాననక కష్టపడే బిల్డింగ్ ఇతక కార్మికుల ఆరోగ్య భద్రత కోసం మంచి నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖలో రిజిస్టర్ అయిన ప్రతి నిర్మాణ కార్మికుడికి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా సమగ్ర హెల్త్ టెస్టులు చేయించనున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకున్న భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులను టార్గెట్ చేస్తూ ఈ స్కీమ్‌ను డిజైన్ చేశారు. మొత్తం రెండు విడతల్లో ఏకంగా 13.38 లక్షల మంది కార్మికులకు ఈ ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో వేల రూపాయలు ఖర్చయ్యే ఈ వైద్య పరీక్షల కోసం ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.2,620 చొప్పున వెచ్చిస్తోంది. అంటే మొత్తంగా కార్మికుల ఆరోగ్యం కోసం ఏకంగా రూ.349 కోట్లు భారీ బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోంది.
సాధారణంగా రోజూ కూలీ పనులు చేసుకునే కార్మికులు తమ అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఈ ఉచిత హెల్త్ క్యాంప్స్‌లో ఒక్కొక్కరికి ఏకంగా 18 రకాల హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. బిపి, షుగర్, బ్లడ్ టెస్టులతో పాటు గుండె, ఊపిరితిత్తులు, వృత్తిపరమైన పనుల వల్ల వచ్చే రకరకాల శారీరక రుగ్మతలను ముందే గుర్తించేలా ఈ స్క్రీనింగ్ ప్రొఫైల్ డిజైన్ చేశారు. కార్మికులు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా, వారి పని ప్రాంతాలు మరియు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఈ మెడికల్ చెకప్స్ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

కేవలం పరీక్షలు చేసి వదిలేయడం మాత్రమే కాకుండా, హెల్త్ స్క్రీనింగ్‌లో ఏమైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా ప్రాణాంతక వ్యాధుల లక్షణాలు బయటపడితే, ఆ కార్మికులను వెంటనే మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేయనున్నారు. అక్కడితో అయిపోలేదు.. మొదటి విడత పరీక్షల్లో ఎవరికైనా తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, వారికి ఉచిత చికిత్స అందించడమే కాకుండా, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండో ఏడాది కూడా ఉచితంగా హెల్త్ టెస్టులు నిర్వహిస్తారు. ఇది కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంతో పెద్ద భరోసానిస్తుంది.
రోజువారీ శ్రమతో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయమని చెప్పవచ్చు. మీ ఇళ్ల వద్ద గానీ, మీ ప్రాంతంలో గానీ పనిచేసే బిల్డింగ్ వర్కర్స్ లేదా లేబర్స్ ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారాన్ని వెంటనే షేర్ చేయండి. అలాగే కార్మిక శాఖలో ఇంకా ఐడీ కార్డ్ లేదా రిజిస్ట్రేషన్ లేని వారు వెంటనే పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ఈ రూ.2,620 విలువైన ఉచిత మెడికల్ స్క్రీనింగ్‌ను ఉపయోగించుకోవచ్చు
