ఏపీ మంత్రవర్గ విస్తరణ పూర్తయిన సంగతి తెలిసిందే. కొత్త మంత్రివర్గంలో పాతవారు 10 మందికి.. కొత్త వారు 15 మందికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంత్రిగా అవకాశం కల్పించారు. తాజా మంత్రివర్గ విస్తరణలో నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు రోజా ఎమ్మెల్యేగా ఉంటూ కూడా.. జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: రాయలసీమకు సముద్రం.. MLA రోజా ట్వీట్ వైరల్!
ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఇలాంటి షోలు, షూటింగ్స్‌లో పాల్గొన్న ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఇక మీదట ఇక కొంత కాలం సినిమాలకు, టీవీ షోలకు గుడ్ బై చెప్పనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రోజానే ప్రకటించారు.
ఇది కూడా చదవండి: MLA రోజాకు భారీ షాక్.. భర్తపై అరెస్ట్ వారెంట్!ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేను. నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు. కానీ జగనన్న నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మహిళా పక్షపాత సీఎం క్యాబినెట్‌లో మహిళ మంత్రిగా చోటు దక్కడం నా అదృష్టం. సీఎం జగనన్న చెప్పిన పని చెయ్యడమే నా విధి. నన్ను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారు. కానీ ఈ రోజు జగనన్న నన్ను మంత్రిని చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తాను. మంత్రి అయినందున ఇక మీదట షూటింగ్‌లు మానేస్తున్నాను. ఇక మీదట టీవీ, సినిమా కార్యక్రమాల్లో పాల్గొనను’’ అని ప్రకటించారు. రోజా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: షాకింగ్: జబర్దస్త్ జడ్జీ పోస్ట్ నుంచి రోజా అవుట్!