దేశంలో కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 213కు చేరిందని కేంద్ర వైద్య శాఖ వివరించింది. వాటిల్లో ఢిల్లీ, మహారాష్ట్రల్లో 57, 54 కేసులు ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 90 ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు కోలుకున్నారని వివరించింది. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మద్యనే ఆంధ్రప్రదేశ్‌లో ఒకరికి ఒమిక్రాన్ సోకగా, చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా ఏపిలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది.
కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన మహిళకు పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కెన్యా నుంచి వచ్చిన మహిళ.. చెన్నై విమానాశ్రయం నుంచి తిరుపతికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ నెల 12 ఆ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో శాంపిళ్లను జీనోమ్ సీక్వేన్సింగ్‌కు పంపించగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.