నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఊహించిన అనుభవం ఎదురయ్యింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో కొందరు వ్యక్తులు రఘురామకు పాలాభిషేకం చేశారు. అదేంటి రఘురామ నియోజకవర్గం నరసాపురం కాగా.. ఆయనకు ప్రకాశం జిల్లాలో పాలాభిషేకం నిర్వహించడం ఏంటనుకుంటున్నారా.. అయితే పూర్తి మ్యాటర్ తెలియాలంటే.. ఇది చదవండి.
కొన్ని రోజుల క్రితం ఏపీలో చింతామణి నాటకం.. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నిషేధం విధించాలని ఆర్య వైశ్య సంఘం నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది.
చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నాటకాన్ని నిషేధిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చింతామణి నాటకంపై ఆధారపడి వేలాది మంది కళాకారులు జీవనం సాగిస్తున్నారని.. ఈ నాటకం నిషేధించడం వల్ల వారందరూ జీవనోపాధి కోల్పోతున్నారని అందులో పేర్కొన్నారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ.. ప్రభుత్వం జారీ చేసి జీవో నెం.7 ను రద్దు చేయాలని రఘురామ కోర్టును కోరారు.
నాటకాన్ని నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి.. తమకు మద్దతు తెలిపినందుకు గాను రంగస్థల కళకారులు ఎంపీ రమురామకృష్ణ రాజుకు సంఘీభావంగా అద్ధంకిలో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. భవానీ కూడలి నుంచి బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రఘురామ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చింతామణి నాటకం విషయంలో తమకు అండగా నిలిచినందుకు ఇలా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.