కర్ణాటక రాష్ట్రం నుండి సుమన్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్స్‌కర్షన్‌కి వెళ్లాడు. అందులో భాగంగా తలకోన జలపాతం సందర్శించుటకు వెళ్లారు. జలపాతం చూడముచ్చటగా ఉండడంతో ఈతకు దిగారు. అందులో ఓ కుంటలో సుమన్ ఈత కొడుతున్న సమయంలో అతని తల బండరాళ్లలో ఇరుక్కుపోయి చనిపోయాడు.
తిరుపతి జిల్లాలో తలకోన జలపాతం ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడికి దేశ నలుమూలల నుండి జలపాతాన్ని తిలకించడానికి వస్తుంటారు. ప్రకృతిలో రమణీయంగా రూపు దిద్దుకున్న ప్రదేశం ఇది. చుట్టు ఎత్తైన కొండలతో, దట్టమైన అడవి ప్రాంతం.. నిత్యం పర్యాటకులు దర్శిస్తుంటారు. తిరుపతికి దాదాపు 45 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. శేషాచల కొండల వరుసలో తల భాగంలో ఉన్నందున తలకోన అంటారు. ఈ జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు ఉంటుంది. విహారయాత్రకు చాలామంది వస్తుంటారు. అయితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుమన్ కూడా తన స్నేహితులతో కలిసి తలకోన వచ్చాడు. జలపాతంలో దిగి ఈత కొడుతూ మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఎలా జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రం నుండి సుమన్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్స్‌కర్షన్‌కి వెళ్లాడు. అందులో భాగంగా తలకోన జలపాతం సందర్శించుటకు వెళ్లారు. జలపాతం చూడముచ్చటగా ఉండడంతో ఈతకు దిగారు. అందులో ఓ కుంటలో సుమన్ ఈత కొడుతున్న సమయంలో అతని తల బండరాళ్లలో ఇరుక్కుపోయింది. దీంతో అతడు ఎంత ప్రయత్నించినా సుమన్ బయటికి రాలేకపోయాడు. నీటిలోనే ప్రాణాలు వదిలాడు. అది గమనించిన అతని స్నేహితులు పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని బయటికి తీసే ప్రయత్నం చేశారు.
వానాకాలం మొదలైంది. వానలకు వాగులు, కుంటలు, చెరువులు నిండుకుంటున్నాయి. ఈ క్రమంలో చాలామంది లోతు తెలియక ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. వర్షాల కారణంగా జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. చూడడానికి ప్రజలు వెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు చూసి అప్రమత్తం కావలసిన అవసరం ఎంతైనా ఉంది. నీళ్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈత రానివారు చాలా మంది ప్రమాదాల బారిన పడే చాన్స్ ఉంది. ఈత వచ్చిన వారు కూడా అప్రమత్తంగా ఉండాలి.