ఏపీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పురుటి నొప్పులతో బాధపడుతూ ఓ మహిళ ఏకంగా అడవిలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఏపీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ మహిళ పురిటి నొప్పులతో ఆస్పత్రికి బయలు దేరింది. వెళ్తూ వెళ్తూనే ఆ మహిళ ఏకంగా అడవిలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియోలో కాస్త వైరల్ గా మారింది. అసలు మహిళ అడవిలో బిడ్డకు జన్మనివ్వడం ఏంటి? అసలేం జరిగింది పూర్తి వివరాలు మీ కోసం. ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే.. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలు మాత్రం ఇంకా అభివృద్దికి ఆమడ దూరంలోనే ఉన్నాయి.
దీనికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది ఏపీలో తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన. విషయం ఏంటంటే? ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పాలమామిడి గ్రామం. ఇక్కడే దేవి (22) అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే తాజాగా ఈ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ కనిపించింది. ఆ సమయంలో దేవిని ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, గ్రామంలోకి అంబులెన్స్ రావడానికి రోడ్డు మార్గం సరిగ్గా లేదు. ఇక ఆ క్షణంలో వారికి ఏం చేయాలో తెలియక బైక్ పై ఆ మహిళను కొంత దూరం తీసుకెళ్లారు.
ఇక మార్గమధ్యంలోకి రాగానే ఆ మహిళ అడవిలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీనిని గమనించిన కొందరు స్థానిక మహిళలు దేవికి అండగా నిలిచారు. అయితే ఈ కాలంలో కూడా అడివిలో మహిళ బిడ్డకు జన్మనివ్వడం ఏంటని స్థానిక మహిళలు వాపోతున్నారు. ఈ ఘటనతో నైనా అధికారులు కళ్లు తెరిచి వెంటనే రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అడవిలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
రోడ్డు మార్గం సారిగా లేక … అంబులెన్స్ రాక … అడవిలోనే బిడ్డకు జననం pic.twitter.com/NJqMElXMEE
— Hardin (@hardintessa143) March 7, 2023