చేపలు పట్టడం కొందరికి సరదా అయితే.. మరికొందరికి అదే జీవనోపాధి. ఎందరో మత్స్యకారులు చేపల వేట మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వెళ్లి రోజులు తరబడి అక్కడే గడుపుతారు. వలకు ఏదైనా చిక్కితేనే ఇంటికి వస్తారు. అలా.. మత్స్యకారుల వాళ్లకు చిక్కే చేప ఎన్ని కిలోలు ఉంటుంది..? పది.. ఇరవై.. యాభై.. మహా అయితే వంద కిలోలు..! కానీ విశాఖ జిల్లాలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారులకు… ఓ భారీ టేకు చెప చిక్కింది. దాని బరువెంతో తెలుసా..? అక్షరాలా వెయ్యి కిలోలు..! ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పాకడంతో దాన్ని చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు తరలి వచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. సాంప్రదాయ పడవలో సముద్రంలో వేట ప్రారంభించారు. సముద్రంలో కొంచెం దూరం వెళ్ళాక.. వలకు ఓ భారీ చేప తగిలినట్టు అనిపించింది. చూసే సరికి అది భారీ టేకు చేప..! దాన్ని పడవలో ఎక్కించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.. చివరకు ఆ చేపకు పెద్ద తాడు కట్టి దాన్ని పడవకు చుట్టి అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. అక్కడ తోటి మత్స్యకారుల సహాయంతో బయటకు లాగారు. దీన్ని విక్రయిస్తే సుమారు రూ.50 వేల వరకు వస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ భారీ చేప 1000 కేజీల పైనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
మున్నెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో చేప చిక్కడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో దాన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. దీన్ని విక్రయిస్తే సుమారు రూ.50 వేల వరకు వస్తుందని చెబుతున్నారు. భారీ సైజు ఉండే టేకు చేపలు సముద్రంలోనే పెరుగుతుంటాయి. సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం.. అది వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ అరుదైన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
1000 kg Rare fish.. pic.twitter.com/UWjZ63eH7N
— Govardhan Reddy (@gova3555) March 12, 2022
1000 kg rare teku fish pic.twitter.com/skBgdm8PDx
— Govardhan Reddy (@gova3555) March 12, 2022