పంచాయతీ ఎన్నికలకు ఉండే క్రేజ్, ఉత్కంఠ వేరే లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని ఆశపడే అభ్యర్థులకు నామినేషన్ల ఘట్టం ఒక పెద్ద యుద్ధంలా మారుతుంటుంది. ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు, అడ్డగింతలు, ఉద్రిక్త వాతావరణం మధ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం సామాన్య అభ్యర్థులకు పెను సవాల్‌గా మారుతుంది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు హైకోర్టు ఒక తీర్పు ద్వారా కొండంత అండగా నిలిచింది. అభ్యర్థులందరికీ కచ్చితమైన […]