ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే పార్వతీపురం మన్యం జిల్లా సహా యావత్ ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది. విజయరామరాజు మరణవార్త తెలియడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. 1948 ఆగస్టు 4వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సంస్థాన […]