దేశంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఔషధ కంపెనీలు, రిటైలర్లు, ఆసుపత్రులు సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయని మండిపడింది. అత్యవసర క్యాన్సర్ మందు తయారీదారుల నుంచి రిటైలర్లకు కేవలం 2వేల 700లకే లభిస్తోందని.. అయితే, అదే మందు సాధారణ రోగులకు విక్రయించేసరికి… రూ.27 వేలు వసూలు చేస్తున్నారని కోర్టు మండిపడింది. తయారీ ధరకు, మార్కెట్లో విక్రయిస్తున్న ధరకూ దాదాపు 10 రెట్లు వ్యత్యాసం ఉండటంపై […]