కర్ణాటకలో హిజాబ్ వస్త్ర ధారణ వివాదం తీవ్ర రూపం దాల్చింది. హిజాబ్, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని కళాశాలల విద్యార్థుల మద్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. పోటాపోటీగా నినాదాలు చేశారు. కొన్నిచోట్ల రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలుచోట్ల పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజుల పాటు డిగ్రీ, పీయూ కళాశాలలకు […]