భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెడుతూ కీలక ప్రకటన చేశాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఓపెన్‌ఏఐ’తో తాను భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు అధికారికంగా వెల్లడించాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సచిన్. త్వరలోనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రాబోతున్నాయని, వాటిని పంచుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ఈ భాగస్వామ్యంపై సచిన్ తన అనుభవాలను పంచుకున్నాడు. తనకు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందని, ఒక ప్రశ్న […]