చెప్పినట్టుగానే 22A భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. నాలా రుసుము చెల్లిస్తే అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని తీర్మానించింది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అర్హత ఉన్న అన్ని దరఖాస్తులను కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 22ఏ […]