హైదరాబాద్- గ్రేటర్ హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నగరం నడిబొడ్డున మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరంలో, అదీ నడిరోడ్డుపై ఒంటరి మహిళను ఓ దుండగుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. మహిళను నడిరోడ్డుపై కత్తితో పొడవడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ భయంకరమైన ఘటన నగరంలోని ఎర్రగడ్డలో జరిగింది. కొంత కాలంగా భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళపై ఖలీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నడి […]