తెలుగు సినీ పరిశ్రమకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినా ఇష్టపడి వచ్చి కష్టంతో స్టార్ హోదాను దక్కించుకున్న అతి కొద్దిమంది హీరోల్లో ఒకరు కింగ్ నాగార్జున. ఇవాళ 66వ ఏట అడుగెట్టిన సందర్భంగా నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తూ..ఆయన గురించి చాలామందికి తెలియని ఆసక్తికర అంశాలు మీ కోసం.. తెలుగు సినీ పరిశ్రమలో మన్మధుడిగా హృదయాలు కొల్లగొట్టినా, శివతో 90 దశకంలో కాలేజ్ లైఫ్ కళ్లకు గట్టినట్టు చూపించినా, అన్నమయ్యతో ఆధ్యాత్మికతను ప్రవహింపజేసినా అతనికే చెల్లుతుంది. […]