ప్రముఖ బాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ల ఆయన్ని కాపాడటానికి తీవ్రంగా శ్రమించారు. అయినా లాభంలేకపోయింది. అర్థరాత్రి సమయంలో ఇస్మాయిల్ తుదిశ్వాస విడిచారు. ఇస్మాయిల్ మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ హీరో గోవిందా […]