బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటి వద్ద మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడూ అభిమానుల కేరింతలతో, సందడిగా కనిపించే ముంబై జుహులోని ఆయన నివాసం ‘జల్సా’ పరిసరాల్లో ఒక్కసారిగా పోలీసుల బూట్ల చప్పుడు, బాంబ్ స్క్వాడ్ హడావుడి మొదలైంది. బిగ్ బి నివాసంతో పాటు ముంబై నగరంలోని పలు అత్యంత కీలకమైన ప్రాంతాలను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఒక బెదిరింపు ఈమెయిల్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ముంబై పోలీసులకు, సంబంధిత అధికారులకు అందిన […]