బుధవారం ఉదయం వేళ అస్సాంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కోల్కతా నుంచి మిజోరాం వెళ్తున్న ప్రయాణికులతో నిండిన ఎక్స్ప్రెస్ రైలు ఊహించని రీతిలో పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. పచ్చని కొండలు, మలుపులతో కూడిన ఆ ప్రాంతంలో రైలు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో అరుపులు, కేకలు వేశారు. కోల్కతా నుండి మిజోరాం రాజధాని వైపు వెళ్తున్న కోల్కతా – సైరంగ్ ఎక్స్ప్రెస్ రైలు అస్సాంలోని దిగారు రైల్వే […]