సిద్దిపేట జిల్లా చేర్యాలలో శుక్రవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతున్న అతడిని అటుగా వెళ్తున్న మహిళా ఎస్సీ క్షణాల్లో అలర్ట్ అయ్యారు. ప్రాణాలకు తెగించి పక్కనే ఉన్న గొనె సెంచులతో మంటలను అదుపు చేసి అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ షాకింగ్ ఘటన శుక్రవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారి పక్కన ఉన్న కేపిఆర్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. […]