ఏపీలో వాతావరణం మళ్లీ మారబోతుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పలకరించనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురిసే వీలుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, దాని […]