దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన 'ద కేరళ స్టోరీ' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే.
అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. కొన్ని ఎంటర్ టైన్ చేస్తే.. కొన్ని మెస్మరైజ్ చేస్తాయి. మరికొన్ని మనచుట్టూ జరిగే సంఘటల్ని చూపిస్తుంటాయి. అయితే వాటిని చూపించే క్రమంలో చాలాసార్లు వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా అలా మన దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసిన మూవీ ‘ద కేరళ స్టోరీ’. పోస్టర్, ట్రైలర్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉంది? అసలు సినిమాలో ఇంతకీ ఏం చూపించారు? అనేది తెలియాలంటే మీరు తప్పకుండా ఈ రివ్యూ చదివేయాల్సిందే.
కేరళ కాసర్ గాడ్ అనే ఊరిలోని నర్సింగ్ కాలేజీలో షాలిని ఉన్నికృష్ణన్(అదాశర్మ), గీతాంజలి(సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని) స్టూడెంట్స్. అసీఫా(సోనియా బలానీ)తో కలిసి రూమ్ షేర్ చేసుకుంటారు. ఐసిస్ లో అండర్ కవర్ గా చేస్తున్న అసీఫా.. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఇస్లాంలోకి మార్చే మిషన్ లో పనిచేస్తూ ఉంటుంది. తన ప్లాన్ లో భాగంగా ఇద్దరబ్బాయిలని రంగంలోకి దించి షాలినీ, గీతాంజలిని లవ్ జిహాద్ ఉచ్చులోకి లాగుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైంది? తెలియాలంటే థియేటర్లలో ఆడుతున్న ‘ద కేరళ స్టోరీ’ మూవీ చూడాల్సిందే.
‘ద కేరళ స్టోరీ’ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పలేం. ఎందుకంటే ఇందులో ఒకటి రెండు కాదు చాలా అంటే చాలా సున్నితమైన అంశాల్ని టచ్ చేశారు. కేరళలోని లవ్ జిహాద్, రాడికలైజేషన్, ఐసిస్ రిక్రూట్ మెంట్, లైంగిక బానిసత్వం లాంటి అంశాల ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. లవ్ జిహాద్ వల్ల ముగ్గురు అమ్మాయిలు ఎలాంటి దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు అనే అంశాల్ని క్లియర్ గా చూపించారు. హిందూ మతపరమైన ఆరాధన, నాస్తికత్వం, కమ్యునిజం, ఇస్లాం, షరియా చట్టాలు బోధించే ప్రక్రియల్ని చూపించడం కత్తి మీద సాములాంటిది. కానీ ఈ విషయంలో మూవీ టీమ్ సక్సెస్ అయింది! వయలెన్స్ కాస్త ఎక్కువగానే చూపించారు. దీనికి ముందే ప్రిపేర్ అయి థియేటర్ కి వెళ్తే బెటర్.
ఫస్టాప్ విషయానికొస్తే.. ఫాతీమాగా మారిన షాలినీ ఉన్నికృష్ణన్ అఫ్ఘానిస్థాన్ లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని తన ఇద్దరు ఫ్రెండ్స్ నిమా, గీతాంజలికి చెప్పడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ లోకి స్టోరీ వెళ్తుంది. నర్సింగ్ కాలేజీలో షాలినీ, నిమా, గీత జాయిన్ కావడం, అసీఫాతో పరిచయం, రమీజ్ అనే అబ్బాయితో షాలినీ ప్రేమలో పడటం, కొన్నాళ్లకు ప్రెగ్నెంట్ కావడం ఇలా సీన్లన్నీ వెళ్తుంటాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అసలు షాలినీ అనే అమ్మాయి ఫాతిమాగా ఎందుకు మారాల్సి వచ్చింది? అప్ఘానిస్థాన్ ఎందుకు వెళ్లింది? ఇలాంటి పాయింట్స్ గురించి తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే.
లవ్ జిహాద్ అనేది చాలా వివాదాస్పదమైన అంశం. దీని నిజానిజాలు ఏంటనేది ఇప్పటికీ క్లియర్ గా తెలియదు. ఎందుకంటే ‘ద కేరళ స్టోరీ’ ట్రైలర్ లో తొలుత 32,000 మంది అమ్మాయిల ఇలా ట్రాప్ లోకి చిక్కుకున్నారని చూపించారు. ఆ తర్వాత మాత్రం ముగ్గురే అన్నట్లు మార్చేశారు. హిందుత్వ వాదులు ఈ మూవీని ఆదరించడానికి, లౌకికవాదులు వ్యతిరేకించడానికి చాలానే కారణాలున్నాయి. సగటు ప్రేక్షకుడు మాత్రం ఇలాంటివి ఏం మనసులో పెట్టుకోకుండా చూస్తే మాత్రం ఓ డిఫరెంట్ మూవీ చూశామనే ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. ఓవరాల్ గా చెప్పుకుంటే ‘ద కేరళ స్టోరీ’ని కేవలం సినిమాలా మాత్రమే చూడండి. అంతకు మించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఎమోషనల్ అస్సలు కావొద్దు.
ఇందులో లీడ్ రోల్ చేసిన అదాశర్మ.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా నటించింది. చాలాచోట్ల తన యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసేసింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చిన అదాశర్మ.. ఈ మూవీతో తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. చెప్పాలంటే చాలా కొత్తగా కనిపించింది. సిద్దీ ఇద్నానీ, యోగితా భిహానీ, సోనియా బలానీవి సహాయ పాత్రలే అయినప్పటికీ ఆయా రోల్స్ కి చక్కగా సెట్ అయిపోయారు. మిగతా యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. యాక్టింగ్ పరంగా ‘ద కేరళ స్టోరీ’లో పెద్దగా వంక పెట్టడానికి ఏం లేదు.
‘ద కేరళ స్టోరీ’ గురించి మాట్లాడితే ఫస్ట్ డైరెక్టర్ ని అభినందించాలి. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా కీలకం. దాన్ని ఫ్లాష్ బ్యాక్, ప్రస్తుత సన్నివేశాలతో చక్కగా బ్యాలెన్స్ చేశారు. కొన్ని సీన్స్ మాత్రం రిపీట్ అయినట్లు అనిపించాయి. ట్రాప్ చేసే సీన్స్ కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. కొన్ని సన్నివేశాల్ని చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగానూ అనిపించింది. ఓవరాల్ గా చూస్తే మాత్రం రియలస్టిక్ గా తీశారు. సంజయ్ శర్మ ఎడిటింగ్ బాగుంది. కొన్ని సీన్స్ కి కత్తెర వేసుండాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కలర్ బ్యాలెన్స్ అన్నీ ఫెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఇది భావజలాన్ని బేస్ చేసుకుని తీసిన మూవీ కాబట్టి దానికి కనెక్ట్ అయితే బాగా నచ్చేస్తుంది. లేదంటే ఓకే ఓకే అనిపిస్తుంది.
చివరగా: గుండె ధైర్యం ఉంటేనే చూడండి!
రేటింగ్: 2.5