Viral Video: ఈ మధ్య కాలంలో రోడ్డు సేఫ్టీ రూల్స్‌ను జనం పూర్తిగా మరిచిపోయారు. రోడ్లపై ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రమాదాలకు గురికావటమే కాదు.. గురిచేస్తున్నారు కూడా. అలా కొన్ని ప్రమాదాలు సీసీ కెమెరాల్లో రికార్డయి వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, ఓ యువతి రోడ్డు ప్రమాదానికి కారణమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సదరు యువతి రోడ్డు సేఫ్టీ రూల్స్ ఫాలో కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రెండు కార్లు ఢీకొట్టుకునేలా చేసింది. కొంచెం ఉంటే ఆమె ప్రాణాలే గాల్లో కలిసిపోయేవి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కొన్ని రోజుల క్రితం ఓ యువతి తన స్నేహితురాళ్లతో కలిసి ఆఫీసుకు వెళుతోంది. ఆఫీసుకు వెళ్లే మార్గంలో ఓ రోడ్డు దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారంతా రోడ్డు దగ్గరకు వచ్చారు. కొంచెం సేపటి తర్వాత ఆ యువతి తన స్నేహితురాళ్లను వదిలి టక్కున ముందుకు దూసుకెళ్లింది. అటువైపు నుంచి వేగంగా వస్తున్న తెల్ల కారు ఆమెపైకి దూసుకువచ్చింది. కొంచెం ఉంటే ఢీకొట్టేదే.. కానీ, తెల్ల కారు వెనకాల వస్తున్న ఓ నల్ల కారు దాన్ని ఢీకొట్టింది. దీంతో తెల్ల కారు పక్క డివైడర్ వైపునకు వెళ్లిపోయింది. నల్లకారు యువతి కుడివైపు దూసుకుపోయింది.
యువతి మాత్రం రెండు కార్ల మధ్యలోంచి సేఫ్టీగా బయటపడింది. యాక్సిడెంట్ కారణంగా ఒక్కసారిగా భయపడిపోయిన యువతి వెనక్కు తిరిగి రాసాగింది. అప్పుడు కూడా ముందు వెనకా ఏమీ చూసుకోకుండా నడుస్తూ ఉంది. అప్పుడు మరో కారు కిందపడేదే.. కానీ, ఆ కారు వ్యక్తి స్లోగా నడపటంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జరిగి నెలలు గడిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ యువతి ఎవరు? ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్న విషయాలు తెలియరాలేదు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: హీరో విజయ్ ని మించిపోయేలా డ్యాన్స్ చేసిన బుడ్డోడు!
