Viral Video: ఎద్దు రైల్లో ప్రయాణించటం ఎంటి? అదీ ఒంటరిగా?.. అనుకుంటున్నారా. అవును! ఇది నిజంగా జరిగింది. ఓ ఎద్దు ఒంటరిగా రైళ్లో ప్రయాణించింది. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా.. తన మానాన అది ఓ వైపు జరిగి నిలబడి ప్రయాణం చేసింది. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం బిహార్ రాష్ట్రంలోని విజయ్ చౌకీ రైల్వే స్టేషన్‌లో ఓ 10-15 మంది మనుషులతో పాటు ఓ ఎద్దు కూడా రైలు ఎక్కింది. అప్పుడు దానితో పాటు ఎవ్వరూ లేదు. అదొక్కటే రైలు ఎక్కింది.
కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కిన తర్వాత దారిలో అడ్డం లేకుండా ఓ పక్కకు జరిగి నిలబడింది. అయితే, జనం అదలా రైలు ఎక్కేసరికి ఆశ్చర్యంలో మునిగిపోయారు. అది ఎక్కిన కంపార్ట్‌మెంట్‌లోని ప్రజలు దాన్ని వింతగా చూడసాగారు. ఇంతలో ఓ వ్యక్తి దాన్ని వీడియో తీయటం మొదలుపెట్టాడు. ఎద్దుకు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి వీడియో తీస్తున్న దగ్గరకు వచ్చాడు. ఆ ఎద్దు ఎలా ట్రైన్ ఎక్కిందన్న సంగతుల్ని చెప్పటం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మరికొంత మంది దాంతో సెల్ఫీలు తీసుకోవటానికి ఎగబడ్డారు. ఇక, ఎద్దు రైల్లో ప్రయాణించటంపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ ఇంతకీ ఆ ఎద్దు టిక్కెట్ తీసుకుందా?లేదా?’’.. ‘‘మనుషులకు మాత్రమేనా సౌకర్యాలు. జంతువులకు అవసరం లేదా?’’.. ‘‘ కలికాలం అంటే ఇదే..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఎద్దు రైల్లో ప్రయాణించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: తనలో గేదె ఆత్మ ప్రవేశించిందంటూ వ్యక్తి విన్యాసాలు.. జంతువుగా మారి..