నేడు ప్రపంచాన్ని మొత్తం సోషల్ మీడియా శాసిస్తోంది. సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా ఓ ప్రభంజనంలా మారింది. ఇంటర్ నెట్ సౌకర్యంలేని ప్రాంతాల్లో తప్పితే.. ప్రపంచం ఆ మూలనుంచి ఈ మూల వరకు సోషల్ మీడియా వాడని వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆ మూల జరిగిన విషయాలు ఈ మూల ఉన్న వారికి తెలుస్తున్నాయి. క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, ఓ తులసి మొక్కకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ వింత సంఘటన జరిగింది. ఆ తులసి మొక్క మనిషిలాగా కిందకు వంగి గ్లాసులోని నీళ్లను తాగుతూ ఉంది.
కార్తీక మాసం సందర్భంగా ఓ ఇంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. తులసి మొక్క అలా నీళ్లు తాగటం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఏంటీ అద్భుతం అంటూ నోరెళ్లబెడుతున్నారు. అయితే, ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందన్న విషయాలు తెలియరాలేదు. గతంలో జరిగిన ఓ సంఘటన తాలూకా పాత వీడియోనే మళ్లీ నెట్టింట చక్కర్లు కొడుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ దీపం వల్ల అది వంగుతుంది. దీపం పక్కన పెట్టు ఫస్ట్. దానికి వేడి తగులుతుంది’’.. ‘‘ సర్ఫెస్ టెన్షన్ కారణంగా ఆ తులసి మొక్క నీళ్లలుకు అట్రాక్ట్ అవుతోంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.