సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత వీధికో సెలెబ్రిటీ తయారవుతున్నాడు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఎక్కువమంది ఫేమస్ అవుతున్నారు. తమకిష్టమైన, పరిజ్ఞానం ఉన్న దాంట్లో వాళ్లు ఓ ఛానల్ పెట్టేసి జనాన్ని ఆకర్షించేస్తున్నారు. వేలు, లక్షలు, మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లను పొంది ఆర్థికంగా ఓ రేంజ్‌కు వెళ్లిపోతున్నారు. అయితే, వీరిలో కొంతమంది ఫాలోయింగ్ స్టార్ హీరోలకు ఉన్నంత ఉంటోంది. వీరికోసం వారి సబ్‌స్క్రైబర్లు ఎంతకైనా తెగించేస్తున్నారు. ఇందుకు తమిళనాడులో చోటుచేసుకున్న తాజా సంఘటనే ఉదాహరణ. ప్రముఖ యూట్యూబర్ స్టార్ టీటీఎఫ్ వాసన్ రోడ్డుపై వెళుతుంటే పెద్ద రచ్చ చోటుచేసుకుంది. వందల సంఖ్యలో అతడి అభిమానులు సంఘటనా స్థలానికి చేరుకుని మద్దతు నిలిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్‌లో అతడికి 38 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పది లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతడు ఏం చేసినా వివాదమే అవుతోంది. గతంలో చాలా సార్లు తన బైక్‌ను అధిక స్పీడుతో నడిపి కేసులు కొని తెచ్చుకున్నాడు. అతడిపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద మూడు కేసులు నమోదయ్యాయి. వీటిపై బెయిల్ తెచ్చుకుని అప్పటినుంచి కాంట్రవర్సీలకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచటానికి రెండు నెలల క్రితం స్పీడ్ బైకింగ్ వీడియో చేశాడు.
ఆ వీడియోలో ప్రముఖ యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ ఫేమ్ జీపీ ముత్తు కూడా ఉన్నాడు. ముత్తును తన బైకు వెనకాల కూర్చోబెట్టుకుని వాసన్ స్పీడుగా బైక్ నడిపాడు. యువకులను డిప్రెషన్‌నుంచి బయటపడేయటానికే ఆ వీడియోను చేసినట్లు అతడు పేర్కొన్నాడు. మీడియా దీన్ని పెద్ద సమస్యగా చిత్రీకరించొద్దని వేడుకున్నాడు. తాజాగా, టీటీఎఫ్ వాసన్ తమిళ దర్శకుడు సెంధిల్ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లాడు. ఈ సందర్భంగా కారులో రోడ్డుపై వెళుతున్న అతడ్ని చూసిన ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడ గుమి కూడారు. అతడి కారును పక్కకు కదలనివ్వకుండా అడ్డుకుని ఫొటోల కోసం ఎగబడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
అతడి ఫ్యాన్స్‌ను చెదరకొట్టి వాసన్‌ను అక్కడినుంచి పంపేశారు. అతడి కారు వెళుతున్నపుడు కొంతమంది యువకులు అతడి కారు వెంట పరిగెత్తి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వాసన్ ఓ యువకుడి చెంపపై ముద్దు కూడా పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై 5 కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో వాసన్‌ను అరెస్ట్ చేయటానికి పోలీసులు రాగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వాసన్‌కు మద్దతుగా నిలిచారు. మరి, స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వాసన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
யாருடா இவனுக எல்லாம்,,
இந்த 2K கிட்ஸ் எல்லாம் என்ன எழவெடுத்த ஜென்மமோ,,🤦♂️🤦♂️🤦♂️ https://t.co/Dg6zuUiz5L— நாகசோதி நாகமணி (@nagajothin) December 16, 2022