ఒక్క పాటతో పార్వతి అనే పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. పార్వతి కర్నూలు జిల్లాలోని మారుమూల లక్కసాగరం అనే ఊరు నుంచి ఓ పాటల కార్యక్రమంలో పాల్గొంది. తన మొదటి పాటతోనే తమ ఊరికి బస్సు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఎవరూ ఈ పార్వతి అంటూ అందరూ ఆమె గురించే వెతుకులాట మొదలు పెట్టారు.
ప్రేక్షకులు, పాఠకుల కోసం సింగర్ పార్వతి, ఆమె తల్లిదండ్రులను సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వూ చేసింది. పార్వతికి ఇంత మంచి పేరు రావడంపై ఆమె తల్లిదండ్రులు ఎంతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పాపకు ఇంత త్వరగా గుర్తింపు వస్తుందని అకోలేదు. మొదటి పాటతోనే మన ఊరికి పేరు తీసుకొచ్చింది అని ఊరిలో వాళ్లు, బంధువులు చెబుతున్నారు. పార్వతి పాటతో మా గ్రామం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమాల్లో అవకాశం పొంది.. మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం’ అంటూ పార్వతి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూని ఈ కింది లింక్ లో మీరూ చూసేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.