కొన్నిసార్లు ప్రమాదాలు భయాన్నే కాదు.. ఆశ్యర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి. అలాంటి ప్రమాదం గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అమెరికాలో గాల్లో ఎగరాల్సిన విమానం నేలపైకి దూసుకొచ్చింది. రోడ్డుపై వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఆ విమానం నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే మరణించగా.. లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి.
North Carolina Army Reservist dies after plane crashes into truckhttps://t.co/VV1f6xj5lg
— National Fallen Officer Foundation (@nationalfof) February 18, 2022
వివరాల్లోకి వెళితే.. ఈ ఘోర ప్రమాదం అమెరికా నార్త్ కరోలినాలోని హైవేపై జరిగింది. బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో.. షార్లెట్ కు ఈశాన్యంగా 50 మైళ్ల దూరంలో డేవిడ్ సన్ కౌంటీ విమానాశ్రయానికి సమీపంలోని 1.85 సౌత్ డ్యూయల్ ఇంజిన్ విమానం రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రక్ డ్రైవర్ కు గాయాలు అవ్వగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతిచెందిన పైలట్ షార్లెట్ కు చెందిన రేమండ్ జాన్ అక్లీ(43) అని వెల్లడించారు. విమానం కూలిపోవడానికి సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. విమానం టేకాఫ్ సమయంలోనే ఏదో సమస్య తలెత్తినట్లు ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి కారులో వెళ్తూ రికార్డు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.