గతంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుగుతున్నాయంటే పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టి ఊదరగొట్టేవారు. అంతేకాకుండా వినాయక చవితి పందిళ్లు, దసరా సమయాల్లో ప్రత్యేకంగా వేదికలు కట్టి డ్యాన్సులు చేయించే వాళ్లు. ఆ సంస్కృతి పాకి.. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు డ్యాన్సర్లతో ఎంటర్ టైన్ చేయిస్తున్నారు. అయితే ఓ కార్యకర్త డ్యాన్సర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించి అభాసుపాలు అయ్యాడుు.
పెళ్లి, ఫంక్షన్లు జరుగుతున్నాయంటే పెద్ద పెద్ద మోతలతో డీజేలు, సాంగ్స్ పెట్టడం కామన్. ఆ సౌండ్స్‌కు ఎవ్వరైనా సరే ఊపు ఆపుకోలేరు. కొంచెమైనా కాలు కదపాల్సిందే. ఇప్పుడంటే ఇంటికో డ్యాన్సర్ వచ్చేస్తున్నారూ కానీ, గతంలో అయితే డ్యాన్సర్లను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు కూడా కొన్ని ఫంక్షన్లలో డ్యాన్సర్లు వచ్చి అలరిస్తున్నారు. పెళ్లి వేడుకల్లోనూ, పుట్టిన రోజు వేడుకల సమయంలో డ్యాన్సర్లు వచ్చి చిందేస్తే కానీ పార్టీ కిక్ ఎక్కదూ. దీని కోసం వారు కూడా ప్రత్యేకంగా చార్జ్ చేస్తారు. బాగా డ్యాన్స్ చేసిన వారిని ప్రోత్సహించేందుకు కొంత మంది డబ్బులు విసరడాలు, జేబులో పెట్టడాలు వంటి పనులు చేస్తూ ఉంటారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త.. ఓ డ్యాన్సర్ పట్ల ఇలానే ప్రవర్తించి వివాదం తెచ్చుకున్నారు.
ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. ఓ పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్న మహిళలపై కరెన్సీ నోట్లను విసిరి వార్తల్లో నిలిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బీజెపీ విమర్శల దాడి చేస్తోంది. వివరాల్లోకి వెళితే ధార్వాడ్ జిల్లాలో పెండ్లి వేడుకలో భాగంగా జరిగిన హల్ధీ ఫంక్షన్‌లో ఓ మహిళా డ్యాన్సర్ నృత్యం చేస్తున్నారు. ఆ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న హుబ్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శివశంకర్ హంపన్న ఆమెతో కలిసి డ్యాన్స్ చేయడంతో పాటు ఆమెపైకి నోట్లను విసిరారు.మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త ఇటువంటి చర్యలకు దిగడం తీవ్ర దుమారం రేగుతోంది.
కాంగ్రెస్ సంస్కృతి ఇదేనంటూ బీజెపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ కార్యకర్త మహిళా డ్యాన్సర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కర్ణాటక బీజేపీ జనరల్ సెక్రటరీ మహేశ్ స్పందిస్తూ ఈ ఘటన “సిగ్గుచేటు” అని అభివర్ణించారు. డ్యాన్స్ చేసే అమ్మాయిపై డబ్బు వర్షం కురిపించిన తీరు.. కాంగ్రెస్‌కు కష్టపడి సంపాదించిన డబ్బుకు విలువ తెలియదని ఈ ఘటన తెలియజేస్తోందన్నారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. ఒక మహిళ పట్ల ఇదేం చర్య అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి కార్యకర్తల వల్ల కాంగ్రెస్ కు చెడ్డ పేరు వస్తుందని తిట్టిపోస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు ముఖ్యం. ఈ తరుణంలో ఆ పార్టీ కార్యకర్తలు ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటు అంటూ వాపోతున్నారు.
Karnataka: Video of a Congress worker showering money on a female dancer in Dharwad goes viral
This comes just ahead of the Assembly elections in the state.@dpkBopanna | @anchoramitaw pic.twitter.com/Xo6Z35MPpb
— TIMES NOW (@TimesNow) March 8, 2023