కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను 135 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, బీజెపీకి 66 సీట్లు మాత్రమే దక్కాయి. సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి. డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పోస్టుతో పాటు కీలక పదవులు కట్టబెట్టారు. అయితే మంత్రి వర్గ విస్తరణ..
దేశం యావత్తు ఆసక్తికరంగా తిలకించిన ఎన్నికలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఫలించి.. అనూహ్యంగా కాంగ్రెస్‌కు పట్టం కట్టారు కర్ణాటక వాసులు. ఎగ్జిట్ పోల్స్ కాదని భారీ మెజార్టీతో గెలుపొందింది కాంగ్రెస్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను 135 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, బీజెపీకి 66 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలు అనంతరం అసలైన ముసలం మొదలైంది. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సందిగ్థత నెలకొంది. తనకే ముఖ్యమంత్రి సీటు దక్కుతుందని ఆశించారు డీకే శివకుమార్. అధిష్టానం తనకే పట్టంకడుతుందని భావించారు సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యా. అందరూ ఊహించినట్లే.. సిద్ధరామయ్యకు జై కొట్టింది కాంగ్రెస్. డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పోస్టుతో పాటు కీలక పదవులు కట్టబెట్టారు. దీంతో వీరిద్దరూ 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజే మో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
అయితే రెండు రోజుల క్రితం మిగిలిన పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మరో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే వీరిలో తన తాత లేకపోవడాన్ని బాధించిందట ఓ మనవరాలికి. బాధపడటమే కాదూ.. తన తాతయ్యకు మంత్రి పదవికి ఎందుకు ఇవ్వలేదంటూ రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ఇంతకు ఎవరీ మనవరాలు అంటారా. సీనియర్ ఎమ్మెల్యే టీవీ జయచంద్ర మనవరాలు. ఆమె పేరు ఆర్నా సందీప్. జయచంద్ర రెండో కుమారుడు సందీప్ కూతురైన ఆర్నాకు ఏడేళ్లు. మూడో తరగతి చదువుతుంది. మంత్రి వర్గ విస్తరణ రోజు తన తాత కూడా టీవీలో మంత్రిగా ప్రమాణం చేస్తాడని చూస్తూ కూర్చుంది. అయితే తన తాత కనిపించలేదు. ఎందుకు కనిపించలేదని అడగ్గా.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని తెలిసి భోరున ఏడ్చిందిట. అయితే ఆమెను ఓదార్చడం ఇంట్లో వారి వల్ల కాలేదట.
ఆ చిన్నారిని ఆపేందుకు రాహుల్ గాంధీకి లేఖ రాయమని చెప్పారు. దాన్నే సీరియస్‌గా తీసుకున్న ఆర్నా లేఖ రాస్తానని పట్టుబట్టడంతో చేసేదేమీ లేఖ పెన్సిల్, పేపర్ అందించారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట్లో వైరల్‍గా మారింది. ఇంతకు ఆ లేఖలో ఏడేళ్ల చిన్నారి ఏం రాసిందంటే ‘డియర్ రాహుల్ గాంధీ, నేను టీబీ జయంచంద్ర మనవరాలిని. నా తాత మంత్రి కాలేదని తెలిసి బాధపడ్డాను. ఆయన్ను మంత్రిగా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, సమర్ధుడు, కష్ట పడే వ్యక్తి’ అంటూ స్మైల్ సింబల్ పెట్టి.. కింద తన పేరును రాసింది. ఇదిలాఉంటే కుంచిటిగ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించక పోవటంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ టీబీ జయచంద్ర మద్దతుదారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి బయట బైఠాయించారు. ఆ తరువాత జయచంద్ర పార్టీ హైకమాండ్ ను కలిసి న్యాయం చేయాలని కోరారు.