పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అనే నానుడి అందరికీ తెలిసిందే. జిహ్వకో రుచి ఉండటం తప్పేమీ కాదులెండు. మరీ ప్రాణాల మీదకు తెచ్చేంత డేంజర్ గా ఉండటం అంటేనే ఆలోచించాలి మరి. కానీ, ప్రజలు అలాంటి అత్యంత విషపూరిత ఆహారాన్ని సైతం తినేందుకు వెనుకాడటం లేదు. ఇది తింటే మీ ప్రాణాలు ఉంటాయో లేదో కూడా తెలీదు.. అని హెచ్చరిస్తున్నా కూడా.. పర్లేదు మేం లాగించేస్తాం అంటున్నారు. మరి అలాంటి అత్యంత విషపూరిత ఆహారాల్లో కొన్నింటి గురించి తెలుకుందాం.
ఫూగు
ప్రపంచంలో కెల్లా అత్యంత విషపూరిత వంటకాల్లో అందరూ చెప్పే మొదటిది ఫూగు వంటకం. దీనిని పఫర్ ఫిష్ తో తయారు చేస్తారు. ఇది జపాన్ లో ప్రాచూర్యం పొందింది. ఈ వంటకం చేసే షెఫ్ కు ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది. కేవలం సర్టిఫైడ్ షెఫ్స్ మాత్రమే ఈ వంటకం చేస్తారు. కొన్ని ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న షెఫ్స్ దీనిని వండుతారు. ఈ పఫర్ ఫిష్ వేస్ట్ ను ఒక స్టీల్ డబ్బాలో పెట్టి తాళం వేసి అత్యంత జాగ్రత్తగా పారేస్తారు. ఆరోజుల్లో జపాన్ చక్రవర్తులు, రాజులు ఈ ఫూగు వంటకం తినడం నిషిద్ధం.
ఆకీ ఫ్రూట్
ఆకీ ఫ్రూట్ ను తినడం కూడా ప్రమాదకరమే. ఇది జమైకా జాతీయ పండు. సరిగ్గా పక్వానికి రాని ఆకీ కాయను తింటే అత్యంత ప్రమాదకరమైన విషానికి బలవ్వాల్సిందే. ఆ కాయ బాగా పండి చెట్టుకి ఉండగానే కాయ విచ్చుకున్నాకనే అది తినడానికి పనికొస్తుంది. అలాంటప్పుడే తినాలి కూడా. లేదంటే జమైకా వాంతింగ్ సిక్ నెస్ కు గరవుతారు.
నత్త గుల్లలు(బ్లడ్ క్లామ్)
చైనాలో బ్లడ్ క్లామ్స్ ను తినడం అనేది కొత్తేం కాదు. తరచుగా వారి ఎపటైట్ లో ఈ నత్త గుల్లలు కామన్ ఫుడ్. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వీటిని తింటే మాత్రం రిస్క్ తప్పదు అంటున్నారు. దాని వల్ల టైఫాయిడ్, హెపటైటిస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
బర్డ్ నెస్ట్ సూప్
ఇది కాస్త వినడానికి వింతగానే ఉంటుంది. పక్షి గూడుతో సూప్ తయారు చేస్తారు. ఇదేదో చౌకగా దొరికేస్తుందిలే అనుకోకండి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూప్ ఇది. ఒక కప్పు ఖరీదు పదివేల డాలర్లు వరకు ఉంటుంది. ఈ సూప్ ను పక్షుల లాలాజలంతో తయారూ చేస్తారంట. ఇది చైనీయుల పురాతన వంటకం. ఎక్కువ తాగితే మాత్రం ప్రమాదమనే చెబుతున్నారు.
కసావా
కసావా అనేది మన దగ్గర దొరికే కంద, చామదుంప తరహాదే. దీంతో కేకులు, జూస్, చిప్స్ ను తయారు చేస్తారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ, దీ వేరు ముక్కను సరైన పద్ధతిలో వండక పోతే తిన్నవారి పరిస్థితి అంతే ఇంక. దీనిలో సైనైడ్ వంటి ప్రమాదకర విష పదార్థాన్ని ఉత్పత్తి చేయగలదు. సరిగ్గా వండారా లేదా అనేది క్లారిటీ తీసుకున్నాకనే దీన్ని వడ్డించడం, తినడం మంచిది.
ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా ఇలాంటి అత్యంత విషపూరిత, ప్రమాదకర వంటకాలు, వస్తువులు ఎన్నో ఉన్నాయి. చూశారుగా ధైర్యానికి పోయి ఇలాంటి ప్రమాదకర వంటకాలను ట్రై చేయకండి.