ఒక సామాజిక బాధ్యతతో సుమన్ టీవీ- మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణగారు ఓ యజ్ఞంలా ప్రారంభించిన కార్యక్రమమే ఖడ్గం. ఈ కార్యక్రమం ద్వారా కొందరు యోధులను, వారు ఈ సమాజానికి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు, వారిని చూసి అందరూ ఎంత స్ఫూర్తిని పొందవచ్చు అనే విషయాన్ని తెలిజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె 8 నెలల గర్భవతి.. ఇంట్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. 14 టైర్ల పెద్ద ట్రక్కు ఇంట్లోకి దూసుకొచ్చింది. ఆ ప్రమాదంతో జీవితం తల్లకిందులైంది. అక్కడితో తన జీవితం ముగిసిపోయింది అనుకోలేదు.. తిరిగి పోరాటం మొదలు పెట్టింది. ఎందుకూ పనికిరాదు అనుకున్న ఎంతో మందితో శభాష్ అనిపించుకున్నారు.
ఆ యోధురాలి పేరు ఛాయా దేవి.. వృత్తి పరంగా టీచర్ గా చేసేవారు. ప్రసవానికి అమ్మగారి ఇంటికి వెళ్లారు. ఓ రోజు మధ్యాహ్నం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో 14 టైర్ల సింమెంట్ లోడ్ లారీ ఇంట్లోకి దూసుకొచ్చింది. ఆ లారీలో 2500 బస్తాల సింమెంట్ లోడ్ ఉంది. అమాంతం బెడ్ రూమ్ లో ఉన్న ఛాయాదేవిని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆవిడ వెన్నెముక, కాలర్ బోన్ ఇలా ఒంట్లోని చాలా ఎముకలు విరిగిపోయాయి. ఆస్పత్రికి వెళ్లారు.. సర్జరీ చేస్తే సెట్ అవుతుంది అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. జీవితంలో తిరిగి తన కాళ్ల మీద నిలబడలేరని వైద్యులు తేల్చేశారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. అందరూ ఎందుకూ పనికిరాదు అనే భావనతో చూస్తుంటే తట్టుకోలేక పోయారు.
తన పని అయిపోలేదని.. చూపించాలనుకున్నారు. వ్యాయామం చేసి తనను తాను లిఫ్ట్ చేసుకునే సామర్థ్యాన్ని పొందారు. ఆ తర్వాత మంచంపై ఉంటూనే పెయింటింగ్ చేశారు, 30 మంది పిల్లలకు ట్యూషన్ చెప్పారు, మిషన్ కుట్టేవారు అలా ఎంతో కొంత ఆదాయం రావడం మొదలైంది. ఆ తర్వాత జీవితం మీద ఆశ.. ఏదైనా సాధించగలరనే నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు అలాంటి నమ్మకాన్ని ఎంతో మందిలో నింపుతున్నారు ఛాయాదేవి. ఆవిడ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విజయాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఈ కింది వీడియో చూడండి. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.