ప్రపంచంలో రోజురోజుకి ఎన్నెన్నో వింతలు, విశేషాలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని వింతలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని షాక్ కి గురిచేస్తాయి. అలా రీసెంట్ గా జరిగిన ఓ పేకాట చుస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలగక మానదు. పేకాటలో ఆశ్చర్యపోయే విషయం ఏముందని అనిపించవచ్చు. కానీ మనిషి మనిషితో కాకుండా జంతువుతో పేకాట ఆడితే.. అందులోను ఓ గుర్రంతో పేకాట అంటే షాక్ అవ్వక తప్పదు.
మనుషులే కాదు.. మాకు కూడా తెలివితేటలు బాగానే ఉన్నాయని నిరూపిస్తున్నాయి పశుపక్షాదులు. తాజాగా తన యజమానితో గుర్రం పేకాట ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఆ గుర్రం ఎలా పేకాట నేర్చుకుంది? ఎలా ఆడగలుగుతుంది? అనే సందేహాలు వ్యక్తం అవడం కామన్. కానీ ఈ యజమాని – గుర్రం స్టోరీ వింటే పక్కా మైండ్ పోతుంది. యజమాని తన గుర్రానికి పేకాట నేర్పించి.. తనతో పేకాట ఆడితేనే తిండి పెడతానని చెప్పడంతో ఆ గుర్రానికి ఆట తప్పట్లేదు. గుర్రం కార్డు మార్చిన ప్రతిసారి ఆ లేడీ దానికి ఫుడ్ ఇవ్వడం మనం చూడవచ్చు.
ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో మనుషులు పెట్స్ తో గేమ్స్ ఆడటం, ఆడించడం చూస్తున్నాం. కానీ రానురాను జంతువులు ఇంతకన్నా తెలివిగా ప్రవర్తించినా మనం ఆశ్చర్యపోయే అవసరం లేదేమో అనిపిస్తుంది. మరి ఈ ఇంటెలిజెంట్ గుర్రం పేకాట పై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.