జంతువులు ఉన్నంత కలివిడిగా మనుషులు కూడా ఉండరేమో. ఒక తల్లి తన పిల్లలకి తప్ప ఇతర పిల్లలకి పాలు ఇవ్వడం అన్నది ఎక్కడో గానీ జరగదు. చాల్లే డబ్బా పాలు పట్టడానికే చేతులు రాని తల్లులున్న ఈ సమాజంలో చను పాలు ఇచ్చే తల్లులు ఉంటారా? అంటే ఏమో చెప్పలేము గానీ జంతువుల్లో మాత్రం తన, తమ అనే బేధాలు లేకుండా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని జంతువులు తమ జాతికి చెందినవి కాకపోయినా వాటితో స్నేహం చేస్తాయి. కొన్ని జంతువులైతే ఇంకో అడుగు ముందుకేసి తల్లి లేని లోటు తీరుస్తుంటాయి. తాజాగా ఒక కుక్క కూడా తమ జాతికి చెందిన జంతువులు అని తేడా లేకుండా పాలు ఇచ్చింది. అందులోనూ వైల్డ్ ఎనిమల్ అయిన పులి పిల్లలకి పాలు ఇచ్చింది.
బేసిగ్గా ఆ కుక్కకి మనుషుల్లా.. జాతి బేధం చూపించడం, క్యారెక్టర్ ఎసాసినేషన్ చేయడం వంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవనుకుంట. అందుకే పులి పిల్లల్ని కూడా తను కన్న కుక్క పిల్లల్లా ట్రీట్ చేసింది. మనుషులు సృష్టించిన ల్యాబ్రాడర్ జాతికి చెందిన ఆడ కుక్క, పులి పిల్లలకు కన్న తల్లిగా మారింది. మూడు పులి పిల్లలు ఆ తెల్లని కుక్క దగ్గరకు వెళ్ళి పాలు తాగాయి. ఆ కుక్క కూడా ఏమీ అనకుండా వాటికి అలానే పాలు ఇచ్చింది. ఆ పులి పిల్లలకి ఆ కుక్కే తల్లి అని అనుకుంటూ పాలు తాగేశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
గతంలో కూడా ఇలాంటి వింతలు చోటు చేసుకున్నాయి. ఒక గొర్రె పిల్లకి ఒక కుక్క పాలు ఇవ్వడం.. ఒక ఆవు, ఒక మేక దగ్గరకెళ్ళి పాలు తాగడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జంతువుల మధ్య ఎలాంటి క్యాస్ట్ ఫీలింగులు ఉండవనడానికి ఈ సంఘటనలే నిదర్శనం. ఈ విషయంలో మనుషులు మూగ జీవాలని చూసి చాలా నేర్చుకోవాలి. మరి పులి పిల్లలకి పాలు ఇచ్చిన కుక్కపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.