హర్షసాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలయని వాళ్లు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్లకి అతని గురించి ఇంకా బాగా తెలుసు. అతి కొద్ది కాలంలోనే అతను ఓ సెలబ్రిటీ అయిపోయాడు. దక్షిణాది రాష్ట్రాల్లో అతడిని బయట చూస్తే ఇచ్చే గుర్తుపడతారు. అతను ఓ యూట్యూబ్ సెన్సేషన్. చాలా తక్కువ వీడియోలతో ట్రెడ్ సృష్టించాడు. పేదవాళ్లకి సాయం చేసే వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. అయితే గత 5 నెలల నుంచి అతని నుంచి ఒక్క వీడియో రాలేదు. అసలు అతను ఏమయ్యాడంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. వీడియోలు చేయకపోవడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
హర్షసాయి తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. పేదవాళ్లకు సాయం చేస్తున్నట్లు అతని యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు ఉన్నాయి. ఓ రోజు ఫ్రీ పెట్రోల్ బంక్ అంటూ వీడియో పోస్ట్ చేశాడు. అందులో వేల మందికి ఉచితంగా పెట్రోలు పోసినట్లు చూపించారు. ఆ తర్వాత ఓ బార్బర్ ని రాత్రికి రాత్రే లక్షాధికారిణి చేశాడు. అతనికి ఓ ఇల్లు కూడా కట్టించాడు. తర్వాత ఓ సాధారణ రైతుకి 5 స్టార్ హోటల్ లో భోజనం పెట్టించాడు. అతని కళ్లల్లో సంతోషం చూసి ఆనందించాడు. తర్వాత చాలా మంది పేదవారికి ఫలకనుమా ప్యాలెస్ లో ప్రత్యేకమైన టేబుల్ మీద విందు భోజనం పెట్టించాడు.
అయితే గత 5 నెలలుగా హర్షసాయి యూట్యూబ్ ఛానల్‌లో ఒక్క వీడియో కూడా పోస్ట్ కాలేదు. అందరూ అసలు హర్షసాయి ఏమైపోయాడంటూ వెతుకులాయ మొదలు పెట్టారు. అయితే హర్షసాయి వీడియోలు చేయకపోవడానికి కారణం ఉందంట. అతను బాహుబలి రేంజ్ లో ఓ వీడియో తీస్తున్నాడట. ఆ వీడియో షూటింగ్, ఎడిటింగ్ కోసం మరే వీడియోలు చేయకుండా ఉన్నాడని చెబుతున్నారు. హర్షసాయి వీడియోలన్నీ ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. మరోసారి ఈ వీడియోతో రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తున్నాడట. అందుకే పూర్తిగా దానిపైనే కాన్సన్‌ట్రేట్ చేసినట్లు చెబుతున్నారు.
పేదలకు సాయం చేసే వాడికి హర్షసాయికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అతనిపై విమర్శలు కూడా లేకపోలేదు. ఆ సాయాలు చేసేందుకు అతనికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు, అసలు ఆ వీడియోలన్నీ ఫేక్ అని.. కావాలనే చేస్తుంటారని ఇంకొందరు విమర్శిస్తుంటారు. అతనికి సన్నిహతంగా ఉండే వారు మాత్రం.. హర్షసాయి తన వీడియోల నుంచి వచ్చే రెవెన్యూని తిరిగి పేదల కోసమే ఖర్చు చేస్తుంటాడని చెబుతుంటారు. కొత్త వీడియో గురించి తెలిసిన తర్వాత అతని ఫ్యాన్స్ మరింత ఆసక్తి పెరిగింది. ఈసారి ఎలాంటి వీడియో వస్తున్నాడో అని ఇప్పటి నుంచే ఎదురుచూపులు మొదలు పెట్టారు.