ప్రతి రోజు అనేక వింత ఘటనలు జరుగుతుంటాయి. ఈ వింతలు పలు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వస్తుంటాయి. ఇలాంటి వింతలను చూసిన అందరూ ఆశ్చర్యపోతుంటారు. వింతైన చెట్ల ఆకారాలు, పశువుల ఆకారాలు, రాళ్లలో ఏర్పడే వింతైనా ఆకృతులను చూసి అందరూ ఆశ్చర్యాపోతుంటారు. వెలుగులోకి వస్తున్న ఈ వింతలకు దేవుడి మహిమే కారణమని కొందరు నమ్ముతుంటారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా ఛత్తీస్ గఢ్‌లోని రాజ్ నందగావ్ జిల్లాలో జరిగింది. ఓ ఆవు.. మూడు కళ్ళు కలిగిన దూడకు జన్మనిచ్చింది. ఈ వింత దూడను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళ్తే..
ఇది కూడా చదవండి:
111 ఏళ్ల బామ్మ బర్త్‌డే సెలబ్రేషన్స్! మరణం ఈమెని మరిచిపోయిందా?
ఛత్తీస్ గడ్ లోని రాజ్ నందగావ్ జిల్లాలోని గండాయ్ గ్రామంలో మకర సంక్రాతి రోజున ఓ ఆవుకు మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంద్రాలు కలిగిన దూడ పుట్టింది. పండగ రోజు ఇలా మూడు నేత్రాలతో దూడ జన్మించడంతో ఆవు యజమాని, గ్రామస్థులు.. ఇది సాక్షాత్తూ శివుడి మహిమే అని, ఇది ఆయన స్వరూపం భావించి, పూజిస్తున్నారు. ఈ వింత దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు. ఈ మూడు కళ్ల దూడను చూసిన ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు.. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరిగిందంటూ పశువైద్యులు పేర్కొంటున్నారు. అయితే.. దూడ ఆరోగ్యంగానే ఉంది. ప్రస్తుతం ఈ దూడకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ వింత దూడపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.