పట్టణాల సంగతి తెలియదు కానీ.. పల్లెల్లో మాత్రం ఏ మూల ఏ చిన్న గొడవ జరిగినా.. వెంటనే నిమిషాల్లో ఊరంతా పాకిపోద్ది. నలుగురు మనుషులు పోగయ్యి.. గొడవ సద్దుమణిగేలా చేస్తారు. కానీ పట్టణాల్లో మాత్రం.. పక్క ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోరు. ఆఖరికి కళ్లముందే దారుణం జరిగినా.. స్పందించరు. పైగా చుట్టూ చేరి చోద్యం చూస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే వీడియోలు తీయడంలో బిజీ అవుతున్నారు తప్పితే.. వారించి.. పరిస్థితిని చక్కదిద్దాలని చూసేవారు కరువు అవుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రారంభమైన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివాన చందంగా కొట్టుకునే కాడికి వచ్చింది. అయితే చుట్టూ ఉన్న విద్యార్థులను వారిని వారించాల్సిందిపోయి.. నవ్వుతూ సినిమా చూసి ఎంజాయ్ చేసినట్లు ఎంజాయ్ చేశారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. నగరంలోని సాగర్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంటీన్‌లో ఇద్దరు విద్యార్థినిల మధ్య వివాదం ప్రారంభం అయ్యింది. వెయింగ్ మిషన్ మీద బరువు చెక్ చేసుకునే అంశంలో ఈ ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అ‍్యింది. మాటలతో మొదలైన గొడవ చిరకు ఒకరిని ఒకరు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ముందుగా ఓ అమ్మాయి మరో యువతి చెంప మీద కొట్టడంతో.. గొడవ పెద్దది అయ్యింది. ఇక ఇద్దరు యువతులు.. తగ్గేదే లే అన్నట్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఇక్కడ విద్యార్థినిలు ఇంతలా కొట్టకుకుంటుంటే.. పక్కన ఉన్న మిగతా స్టూడెంట్స్.. కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేయసాగారు తప్ప.. వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. అబ్బాయిలు, అమ్మాయిలు సరదాగా వీరి గొడవను ఎంజాయ్ చేయసాగారు. ఇక ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.
Kalesh B/w Two Girls In College Canteen (DSCE, Bangalore) pic.twitter.com/E5b165yH2w
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 9, 2022