కలల రాకుమారుడ్ని పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు ఊహల్లో తేలుతుంటారు. అందగాడు, మాటకారి, సెన్సాఫ్ హ్యుమర్, మంచి ఉద్యోగం ఉన్న వరుడి కావాలంటూ కోరికలు చిట్టా విప్పుతున్నారు. దీంతో దేశంలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం కష్టంగా మారింది. పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోయారు. అయితే..
కలల రాకుమారుడ్ని పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు ఊహల్లో తేలుతుంటారు. అందగాడు, మాటకారి, సెన్సాఫ్ హ్యుమర్, మంచి ఉద్యోగం ఉన్న వరుడి కావాలంటూ కోరికలు చిట్టా విప్పుతున్నారు. దీంతో దేశంలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం కష్టంగా మారింది. పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. కట్నం కాదు కదా ఎదురిచ్చి పెళ్లి చేసుకుంటామన్న పిల్ల దొరకడం లేదు. ఓ పెళ్లి అవ్వడమే గగనంరా బాబూ అనుకుంటున్న ఈ తరుణంలో కొంత మంది రెండేసి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒక అమ్మాయిని మెయిన్ టేన్ చేయడానికి ముప్పతిప్పలు పడాలి అనుకుంటుంటే.. ఇద్దరితో ఒకరికి ఒకరికి తెలియకుండా సంసారం చేస్తుంటారు రెండిళ్ల పూజారులు. అయితే ఎలా ఉన్నా భర్త మాత్రం అందగాడు అయ్యి ఉండాలి భార్యలకు.
బట్టతల ఉందనే కాకుండా తనకు పెళ్లైందన్న విషయం దాచి మరో వివాహానికి సిద్ధమైన ఓ వ్యక్తిని చితక బాదింది వధువు కుటుంబం. ఈ ఘటన బీహార్‌లోని గయా జిల్లా డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజౌర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇక్బాల్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి పెళ్లై, భార్య ఉంది. అయితే మెదడులో ఏం పురుగు పుట్టిందో ఏమో.. రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా బ్రోకర్‌ను సంప్రదించాడు. తనకు వివాహం అయ్యి, బట్టతల ఉందని విషయాన్ని దాచి పెట్టాడు. దీంతో బ్రోకర్.. బజౌరా గ్రామానికి చెందిన యువతితో పెళ్లి ఖరారు చేశాడు. పెళ్లి రోజు రోజు రానే వచ్చింది. అప్పటి వరకు తన బట్టతలను విగ్గులో కవర్ చేశాడు.
విగ్గు పెట్టుకుని పెళ్లి మండపంపైకి నవ్వుతూ వచ్చాడు. ఈ క్రమంలో అతడి జుట్టుపై వధువు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అతడి దగ్గరకు వెళ్లి విగ్గును లాగేయగా.. అది ఊడిరావడంతో అంతా పగులబడి నవ్వారు. ఈ సమయంలో అతడికి ఇది రెండో పెళ్లి అన్న విషయం వధువు కుటుంబ సభ్యులకు తెలిసి.. వరుడ్ని చితక్కొట్టారు. తనకు క్షమించి వదిలేయాలని వేడుకున్నాడు. ఇంతలో ఈ విషయం మొదటి భార్యకు కూడా ఈ విషయం తెలిసి.. ఆమె కూడా భర్తను ఉతికింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఈ మేటర్ పోలీసులకు వరకు వెళ్లకుండా సమస్యను పరిష్కరించారు గ్రామ పెద్దలు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేని పేర్కొంది.