మన దేశంలో చాలా మంది కష్టపడకుండా జీవించాలని కలలుకంటూ ఉంటారు. కష్టం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండాలని అనుకుంటారు. మరికొందరు కష్టపడడం చేతకాక ఇతరులను మోసం చేస్తూ అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ ఉంటారు. ఇంకో రకం కాళ్లు చేతులు సరిగ్గా ఉన్నాగాని పని చేయడం చేతకాక బిచ్చమెత్తుకుని బతుకుతూ ఉంటారు. అమృత్‌సర్‌లోని 80 ఏళ్ల బామ్మ నడుపుతున్న జ్యూస్ స్టాల్ విశేషంగా నిలిచింది. చకాచకా బత్తాయి రసం యిస్తూ కస్టమర్లను ఆకట్టు కుంటున్నారు.
ఆరు పదుల వయసు దాటినా మాకు మేమే సాటి అంటున్నవారు ఈ మధ్య కాలంలో చాలామంది దర్శనమిస్తున్నారు. తమ టాలెంట్‌తో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారుతున్నారు.ముదిమి వయసులో కూడా చాలా కష్టపడుతూ జ్యూస్ బండి ద్వారా జీవనాన్ని సాగిస్తూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాదు యుక్తవయసులో కూడా పనీ పాటా లేకుండా తిరిగే ఆవారా బ్యాచ్‌కు ఈ బామ్మ పెద్ద సవాలే విసురుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వృద్ధాప్యంలో హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలు మీద కాలువేసుకుని జీవించే అదృష్టం ఎంతమందికి ఉంటుందో తెలియదు గానీ, తమకు ఏజ్ జస్ట్ ఒక నంబరు మాత్రమే అసలు వయసు ఒక సమస్యేకాదు అని చాలామంది సీనియర్ సిటిజన్స్ నిరూపిస్తున్నారు . వృద్ధాప్యం ఓ భిన్నమైన జీవన దశ! కాలంతో పాటే యవ్వన ఛాయలు కరిగిపోతూ దశాబ్ధాల శ్రమ ఫలితంగా శరీరం అరిగిపోతోందన్న సంకేతాలు అందే సమయం.
జీవితంలో చివరి దశ కావడంతో శారీరక మార్పులను ఆపడం ఎవరి తరం కాదు. మనిషికే కాదు, ప్రతి జీవికి ఈ మజిలీ తప్పదు. ముదిమి వయసులో శారీరక సమస్యలు, మానసిక ఇబ్బందులు ఇలా ఆ రెంటీకి ఆర్ధిక సమస్య కలిస్తే ఆ జీవితం నరకమే. కాని ఆ వయసులో వృద్ధులు పిల్లల నుంచి ఆదరణ కోరుకుంటారు. ఈ వయసులో ఆమె చాలా కష్టపడుతున్నారు. దయచేసిన ఎవరైనా ఆమెకు సాయం చేయండి అంటూ ఒక ట్విటర్ యూజర్ వీడియోను ట్వీట్ చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్ అయింది.
ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. వీలైతే ఆమెకు ఒక ఎలక్ట్రానిక్ జ్యూసర్ ఇవ్వాలనుకుంటున్నానని ఒకరు ట్వీట్ చేయగా మరికొందరు భిన్నంగా స్పందించారు. పాశ్చాత్య దేశాలలో, సీనియర్లు విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు వీలుగా పెన్షన్లు పొందుతారు. కానీ మనదేశంలో మాత్రం వారికి నరకమే అంటూ ఒకరు ఆవేదన వ్యక‍్తం చేశారు.
సులభంగా డబ్బు కావాలనుకునే యువత ఈమెను చూసి సిగ్గుపడాలని మరొకరు ట్వీట్ చేశారు. తన కష్టార్జితాన్ని నమ్ముకుని గౌరవంగా జీవించాలనుకునేవారికి ఆమె ఒక రోల్ మోడల్ అని అభిప్రాయపడుతున్నారు.
The bibiji in the video below has her juice stall in Amritsar. She is working hard in her old age. Please show some love and support to her. The address of her stall is Rani da bagh Amritsar, Opp SBI Bank, near Uppal Neuro Hospital.
Please share with your contacts 🙏 pic.twitter.com/YTpjk4IIWm— A Sidhu (@asidhu_) July 27, 2021