ప్రతి ఒక్క కుటుంబంలో పెళ్లంటే ఒక పెద్ద పండుగ. ఆ పెళ్లికి అనేక మంది బంధువులు వస్తారు. వచ్చినవారు వయస్సుతో సంబంధం లేకుండా తమ ఆట పాటలతో సందండి చేస్తారు. వారు ఆడింది ఆట.. పాడింది పాట.. అక్కడికి వచ్చినవారి చిందులు మాములుగా ఉండవు. ఈ మధ్య కాలంలో అలా బరాత్ వీడియోలు ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పెళ్లిలో ఉన్న వ్యక్తుల వింత నృత్యాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఫేమస్ అయిన నాగిన్ డ్యాన్స్ తో కొందరు అదరకొట్టేస్తున్నారు. మరికొందరు రోలింగ్ చేస్తూ నృత్యంతో ఆకట్టుకున్న వీడియోలు చూశాం. ఇలాంటి కోవకు చెందిన ఒక ఆంటీ చేసిన డ్యాన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వైరల్ గా మారిన ఈ వీడియోలో, ఓ ఆంటీ ఫేమస్ బ్యాంగ్ బ్యాంగ్ పాటకు ఫ్లోర్ మూమెంట్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇది చూసిన అక్కడి వారు మొదట షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆమెతో కలసి వారు కూడా స్టెప్పులేశారు. ఆంటీ నేలపై కూర్చుని చేసిన నృత్యం అక్కడివారిలో మరింత జోష్ నింపింది. ఆంటీ.. ఆ వయస్సులోనూ అంత ఎనర్జీటిక్ గా డ్యాన్స్ చేసి అక్కడ సందండి చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.