అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. అయినా సరే.. తాను అనుకున్న గమ్యాన్ని చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. విషయం ఏంటంటే? ఓ మహిళా టీచర్ కోసం ఆ దివ్యాంగుడు ఏకంగా వీల్ చైర్ పై శబరిమల యాత్ర చేపట్టాడు. అతడు వీల్ చైర్ పై రోడ్డుపై వెళ్తుంటూ అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. దివ్యాంగుడు అయి ఉండి ఎందుకు శబరిమల యాత్ర చేపట్టాడు. అసలు ఎందుకు ఆ మహిళా టీచర్ కోసం ఆ వ్యక్తి శబరిమలకు యాత్ర చేపట్టాడనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది కేరళలోని మలప్పురా ప్రాంతం. ఇదే ప్రాంతంలో తమిళనాడుకు చెందిన కన్నన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత రెండేళ్ల కిందట కన్నన్ తమిళనాడుకు వలస వచ్చి స్థానికంగా ఏదో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఓ లారీ ప్రమాదంలో కన్నన్ పూర్తిగా దెబ్బతినింది. దీంతో అతని కాలు పని చేయకపోవడంతో కొంత కాలం నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో వారి కుటుంబం రోడ్డున పడాల్సి వచ్చింది. అలా కొంత కాలం పాటు అతని భార్య సంసారాన్ని నెట్టుకుంటు వచ్చింది. ఇదిలా ఉంటే స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఎంపీ సమీరా అనే మహిళ ఉపాధ్యాయురాలు పని చేస్తుంది. కన్నన్ పరిస్థితిని గమనించిన ఆమె ఎలాగైన అతనికి సాయం చేయాలని భావించింది.
ఇందులో భాగంగానే అతని గురించి పూర్తిగా తెలుసుకుంది. దీంతో అతనికి సొంత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడతున్నాడని తెలుసుకుంది. ఇక సమీరా కన్నన్ రూ.8 లక్షలు తన సొంత డబ్బులు వెచ్చించి అతనికి ఓ కొత్త ఇల్లును నిర్మించింది. ఇంతటితో ఆగక అతనికి ఆర్థికంగా సాయం చేసి కన్నన్ కు ఓ వీల్ చైర్ ను కొనిచ్చింది. టీచర్ సమీరా చేసిన సాయాన్ని మర్చిపోలేని కన్నన్ ఆమె బాగుండాలని భావించి వీల్ చైర్ పై శబరిమల యాత్రకు బయలు దేరాడు. చేసిన సాయాన్ని మర్చిపోకుండా కాళ్లు పనిచేయకున్నా సరే.. ఆమె మేలు కోరి శబరిమల యాత్రకు పూనుకున్న కన్నన్ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీచర్ సమీరా బాగు కోరి వీల్ చైర్ పై శబరిమలకు బయలుదేరిన కన్నన్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.