సాధారణంగా పెళ్లి అనేది లైఫ్ లో ఒక్కసారి జరిగే పండగ లాంటిది. అలాంటి పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంటే మాత్రం.. ఆ సంఘటన జీవితాంతం మర్చిపోలేరు. ఈ మధ్య అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మాములుగా ఎవరి స్థాయిని బట్టి పెళ్లి వేడుకలను అరెంజ్ చేసుకుంటారు. కొందరైతే పెళ్లి కోసం ఏకంగా ఈవెంట్ మేనేజర్లను పిలిచి ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో పెళ్లంటే పందిరి – తోరణాలు కాకుండా.. హల్దీ, సంగీత్, డ్రెస్సింగ్, గ్రాండ్ ఎంట్రీ, గ్రాండ్ రిసెప్షన్ అంటూ వెరైటీగా ట్రై చేస్తున్నారు.
తాజాగా ఓ పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో ఆదివారం ఎంతో వైభవంగా జరిగిన ఒక పెళ్లిలో వేడుకలో వధూవరులు అందంగా అలంకరించిన పెళ్లి ఊయల పై అలా విద్యుత్ కాంతుల మధ్య గాల్లోకి పైకి లేచారు. ఉన్నట్టుండి ఊయలకు ఉన్న ఒకవైపు తాడు తెగిపోవడంతో 12 అడుగుల ఎత్తు నుంచి వధువరులు కిందపడ్డారు.
వెంటనే బంధువులు చేరుకొని గాయపడిన వధూవరులను పైకి లేపారు. అయితే ఈ ఘటనకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బాధ్యత వహించి క్షమాపణలు తెలిపింది. ప్రస్తుతం పెళ్లి జంట కిందపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Unfortunate accident at Raipur Wedding yesterday.
Thank God all are safe.
source : https://t.co/yal9Wzqt2f pic.twitter.com/ehgu4PTO8f— Amandeep Singh 💙 (@amandeep14) December 12, 2021