టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి ఛాన్స్ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ప్రగతి.. ఎక్కువగా సినిమాల్లో ఎన్నో సైడ్ క్యారెక్టర్స్ పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. కెరీర్ పరంగా ఆమె కేవలం తెలుగు వరకే పరిమితం కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టి పెరిగిన ప్రగతి.. హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో అడుగుపెట్టింది. ఐతే లాక్ డౌన్ ముందువరకు ప్రగతి అంటే అభిమానులకు సైలెంట్ – హోంలీగా అని మాత్రమే తెలుసు.
కానీ లాక్ డౌన్ సమయం నుండే ఆమెలోని అసలు విశ్వరూపం, ఇతర టాలెంట్స్ అన్ని బయట పెడుతోంది. ఇంట్లో ఖాళీగా ఉండలేక సోషల్ మీడియాలో తనకు ఇష్టమైన డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఓ రేంజ్ లో అలరిస్తుంది. ఇప్పటికే ఆమె చేసిన డాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ప్రగతి స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ షాకిస్తుంది. మొత్తానికి సోషల్ మీడియాను షేక్ తానూ ముందే ఉంటానని నిరూపిస్తోంది ఈ సీనియర్ నటి. ఈ వైరల్ వీడియో పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.