చాలా మంది ఇళ్ళలో టాయిలెట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇండియన్ టాయిలెట్, లేదా వెస్టర్న్ టాయిలెట్స్ ఉంటాయి. ఈ మధ్య ఎక్కువ మంది వెస్టర్న్ టాయిలెట్స్ నే వాడుతున్నారు. అసలు ఈ రెండిటిలో ఏది మంచిది? ఏ టాయిలెట్ వాడితే ఆరోగ్యానికి మంచిది? అనేది తెలుసుకోవాలనుకునేవారికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది.
పొద్దున్న లేవగానే చాలా మంది చేసే పని వితవుట్ వీసా, పాస్ పోర్ట్ లండన్ వెళ్లిపోవడం. అదేనండి మరుగుదొడ్డి. మరుగుదొడ్డిని లండన్ అని, టాయిలెట్ అని అంటాం కదా. కడుపులో ఉన్న బరువుని దించుకోకపోతే ఆరోజంతా పనులు సరిగా జరగవు. అందుకే పొద్దున్న లేవగానే లోడ్ దించేస్తారు. అయితే ఆ లోడ్ దించడం కోసం ఏ టాయిలెట్ ని వాడుతున్నారు మీరు. అంటే మీ ఇంట్లో ఎలాంటి టాయిలెట్ ఉంది. ఇండియన్ టాయిలెట్టా లేక వెస్టర్న్ టాయిలెట్టా? ఇండియన్ టాయిలెట్ మంచిదా? లేక వెస్టర్న్ టాయిలెట్ మంచిదా? ఈ రెండిటిలో ఏది వాడితే మంచిది? వెస్టర్న్ టాయిలెట్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా? ఇండియన్ టాయిలెట్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా? అంటే అవుననే చెప్పాలి.
పాశ్చాత్య వస్తువులు చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. వెస్టర్న్ టాయిలెట్ మీద నిటారుగా 90 డిగ్రీల పొజిషన్ లో కూర్చుంటారు. పై శరీరానికి తగ్గట్టు తుంటి కూడా 90 డిగ్రీల పొజిషన్ కి బెండ్ అవుతుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ప్రేగుల మార్గానికి అంతరాయం కలిగిస్తుందని.. ఈ మార్గాన్ని మూసివేస్తుందని అంటున్నారు. దీని వల్ల ప్రేగుపై అదనంగా ఒత్తిడి పడుతుందని.. ఇది భౌతిక శాస్త్ర ప్రాథమిక నియమాలకు విరుద్ధమని చెబుతున్నారు. అంతేకాదు చర్మం డైరెక్ట్ గా వెస్టర్న్ టాయిలెట్ కి తగలడం వల్ల ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉంది. ఇండియన్ టాయిలెట్స్ తో పోలిస్తే విసర్జన ప్రక్రియలో వెస్టర్న్ టాయిలెట్స్ తో చాలా శ్రమ పడాల్సి వస్తుంది.
వెస్టర్న్ టాయిలెట్స్ సౌకర్యంగా ఉంటాయని చెబుతారు గానీ ఆరోగ్యపరంగా చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఇండియన్ టాయిలెట్స్ లో విసర్జన చేయడం వల్ల వ్యాయామం చేసినట్టు ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇండియన్ టాయిలెట్స్ లో కూర్చోవడం వల్ల స్క్వాట్ ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. చెమట పడుతుంది. చేతులు అటూ ఇటూ కదిపే అవకాశం ఉంటుంది. రోజూ ఎక్సర్సైజ్ చేయాలనుకుని చేయలేని వారికి ఇండియన్ టాయిలెట్స్ వల్ల మంచి వ్యాయామం అవుతుంది. అంతేకాదు ఇండియన్ టాయిలెట్స్ ని వాడడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చేతులకు, కాళ్లకు మంచి వ్యాయామం అవుతుంది.
ఇండియన్ టాయిలెట్స్ లో విసర్జన చేయడం వల్ల స్క్వాటింగ్ పొజిషన్ అనేది కడుపును పిండుతుంది. ఇది కడుపులో ఉన్న ఆహారాన్ని నొక్కడం, ఒత్తిడి చేయడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. అదే వెస్టర్న్ టాయిలెట్ లో కూర్చుంటే కడుపు మీద ఎలాంటి ఒత్తిడి పడదు. దీని వల్ల పూర్తిగా విసర్జన చేసే అవకాశం ఉండదు. ఇక గర్భవతులకు అయితే ఇండియన్ టాయిలెట్ చాలా మంచిది. గర్భవతులు ఇండియన్ టాయిలెట్ వాడడం వల్ల గర్భాశయం మీద ఒత్తిడి పడదు. డైలీ ఇండియన్ టాయిలెట్ వాడడం వల్ల గర్భవతులకు సహజ కాన్పు సజావుగా జరిగే అవకాశం ఉందని స్టడీస్ చెబుతున్నాయి. ఇండియన్ టాయిలెట్స్ లో స్క్వాటింగ్ విధానం శరీరంలో పెద్ద ప్రేగులో ఉన్న మలాన్ని పూర్తిగా బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అపెండిసైటిస్, పెద్ద ప్రేగు క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలను నివారిస్తుంది.
ఇక నీరు వినియోగం విషయానికి వస్తే.. ఇండియన్ టాయిలెట్స్ తో పోల్చితే వెస్టర్న్ టాయిలెట్స్ కి ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. ఇక నీరు అవసరం లేకుండా టాయిలెట్ పేపర్ తో తుడుచుకుందామన్నా గానీ పేపర్ వృధా అవుతుంది. అయితే ఇండియన్ టాయిలెట్స్ అనేవి వృద్ధులకు, కీళ్ల వ్యాధులు ఉన్నవారికి, అప్పుడే శస్త్రచికిత్స చేయించుకున్నవారికి సౌకర్యంగా ఉండదు. అదే వెస్టర్న్ టాయిలెట్ అయితే వీరికి సౌకర్యంగా ఉంటుంది. మరి మీ ఇంట్లో ఏ టాయిలెట్ ఉంది. ఇండియన్ టాయిలెట్టా? వెస్టర్న్ టాయిలెట్టా? మీకు ఏది సౌకర్యంగా అనిపిస్తుంది? ఏది మంచిదని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.