నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు. అలాంటి పిల్లల భవిష్యత్ నాశనం అవుతుంటే ఏ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఊరుకోలేరు. అలాంటి పిల్లలకు సరైన చదువు అందకపోవడంతో ఆ తల్లిదండ్రులు చూడకుండా ఉండలేకపోయారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి బాధలను తీర్చిన లీడర్లే లేరు. దీంతో విసిగిపోయిన ఆ గ్రామస్థులు అంతా ఏకమై ఏకంగా సర్కారు బడికే తాళం వేశారు. అసలు సర్కారు బడికి తాళం వేయడం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం. ఈ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఊళ్లోని పిల్లలంతా వెళ్తుంటారు. అయితే గత రెండేళ్ల నుంచి ఈ పాఠశాలలో ఒకే మాస్టారు పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఇదే విషయమై గ్రామస్థులు గతంలో ఎంతో మంది అధికారులను కలిసి సమస్య గురించి వివరించారు. పరిష్కరిస్తామని చెప్పి అనంతరం మాటమార్చారు. దీంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామస్థులు తట్టుకోలేకపోయారు.
ఇది కూడా చదవండి: బాలుడి ప్రాణాలు తీసిన నూడుల్స్..!
ఆ గ్రామంలో ఉన్న ఈ పాఠశాలకు ఒకే ఉపాథ్యాయుడు వచ్చి పాఠాలు చెప్పడంతో మా పిల్లల జీవితాలను అధికారులు నాశనం చేస్తున్నారని గ్రహించారు. దీంతో ఇన్నాళ్లు వేచి చూసిన గ్రామస్థులు ఇక సమస్యకు పరిష్కారం చూపాల్సిందేనంటూ అంతా ఏకమై గ్రామంలోని సర్కారు బడికి తాళం వేశారు. వెంటనే మా గ్రామంలోని పాఠశాలకు సరిపడా ఉపాథ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే స్పందించారు స్థానిక మండల విద్యాధికారి. తక్షణమే ఈ పాఠశాలకు మరో టీచర్ ను నియమిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.