హైదరాబాద్ మహానగరం బోసి పోయింది. కరోనా లాక్ డౌన్ తరహా దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతా సంక్రాంతి పండగ వేళ ఊరికి ప్రయాణమవుతున్నారు. చాలా మంది ఇప్పటికే నగరం దాటేయగా.. సెలవులు దొరకని వారు ఇవాళ్టి వరకు ఆగినట్లు ఉన్నారు. బస్ స్టేషన్లు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. రైల్వేస్టేషన్లు కూడా ప్రయాణికుల రద్దీతో జాతర వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు షాకిచ్చింది.
జనవరి 13, 14వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలో సిటీ బస్సులు, మెట్రోలు మాదిరిగానే ఎంఎంటీఎస్ ల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. పండగ వేళ ఎంఎంటీఎస్ లకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే తప్పని పరిస్థితుల్లో కొన్ని రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీస్ లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
ట్రాక్ మెయింటినెన్స్, ఆపరేషనల్ పనుల దృష్ట్యా జంటనగరాల్లో ఎంఎంటీఎస్ రైల్ సర్వీసులు కొన్ని రద్దు చేస్తున్నామన్నారు. లింగంపల్లి- నాంపల్లి మార్గంలో రెండు రైళ్లు, నాంపల్లి- లింగంపల్లి మార్గంలో 3, ఫలక్ నుమా- లింగంపల్లి మధ్య 5, లంగంపల్లి- ఫలక్ నుమా మధ్య ఆరు సర్వీసులు, రాంచంద్రాపురం- ఫలక్ నుమా పరిధిలో 1, రాంచంద్రాపురం- ఫలక్ నుమా రూట్ లో ఒక సర్వీస్ ను రద్దు చేశారు. ఇలా మొత్తం 19 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వివరాలను వెల్లడించారు. ప్రయాణికులు ఈ సమాచారానికి తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలంటూ కోరారు.
Cancellation of #MMTS Trains on 13th and 14th January, 2023 pic.twitter.com/eQxJJs7OGB
— South Central Railway (@SCRailwayIndia) January 12, 2023